చెప్పుకోని భయాలు
చెప్పుకోని భయాలు
నీకేం అన్నీ జరిగిపోతాయి
అని ఉత్తినే అనేస్తారు
నిదురపోలేని క్షణాల్ని
మళ్ళీ ఆహ్వానించిన సంగతి
వారికి తెలియదు కదా
ఇంకాసేపు నవ్వితే కన్నీళ్ళు వస్తాయి
అనేంత నచ్చించిన కాలం
మళ్లీ ఏడుపునే బహుమతిగా ఇచ్చేస్తుందని
నాకూ తెలియదు కదా
చెప్పుకోని భయాలు అన్నీ
కథలుగా చెప్పే ప్రయత్నమా
నేడొక దుర్నిమిత్తమా
