ధూమపానం ((prompt 31)
ధూమపానం ((prompt 31)


పొగాకు వాడకం చెడు అలవాట్లకు ఆలవాలం
సరదాగా మొదలై అలవాటుగా మారే వ్యవహారం
మనిషి పొగాకును పీల్చి పడతాడు సంబరం
తర్వాత అది మనిషినే పీల్చి చూస్తుంది అంతం
దీని వాడకంతో పాడౌను ఊపిరితిత్తులు కాలేయం
అలవాటైన వ్యక్తితో పాటు పాడౌను పక్కవారి ఆరోగ్యం
రాత్రింబవళ్ళు కలవరపెట్టును తనకున్న సిగరెట్ వాడకం
తన వారిపై ప్రేమతో నైనా మానాలి తాను ఈ వ్యసనం.