సిగ్గెందుకే
సిగ్గెందుకే


వీరుడైన వాడు
నిన్ను కోరి వచ్చాడు
వలపుల మాలలతో స్వాగతాలు చెప్పక
ఈ సిగ్గెందుకే లలనా
రాతి కండల వాడు
చూడ చక్కని వాడు
సొంపైన మీసకట్టు కలవాడు
ఇంకా యోచనా లలనా
వీరుడైతేనేమి ఇంకనూ వరుడు కాదే
మనసు ఇచ్చిన వాడు
మాంగల్యము ముడి వేయుటకు జాగేల
దంపతులైన పిదప ఈ సుందరి ఆతని అర్థ భాగము కదా
మరి నిర్ణయము తీసుకోడేల
అని రాయంచకు తెలిపె ఆ రాకుమారి