మరోసారి నీ ఊసుల్లోకి
మరోసారి నీ ఊసుల్లోకి
మురికిని శుభ్రము చేయు ఇండుప గింజవో
కొత్తగా మెలిక పెట్టు కితకితల ఊరట అని
వెళ్ళకూడని చోటని తెలిసీ
వెళ్లి ఇరుక్కున్న స్థలంలోకి
మరోసారి నీ ఊసుల్లోకి
నేనే వచ్చాను
ఈసారి తప్పంతా నాదే
ఇక నిన్నేమీ అనను
అనడానికి నేనుండను..
