ఊహా లోకం (prompt 11)
ఊహా లోకం (prompt 11)


తన ఊహాలోకం మనిషికి ఎంతో మక్కువైనది
మనిషి గడప దాటకున్నా ఊహ ఎక్కడికో పోతుంది
ఊహ మనిషికున్న హద్దులు చెరిపి ఎల్లలు దాటిస్తుంది
తెలియని ప్రదేశాలను కూడా కమ్మని కలగా చూపిస్తుంది
ప్రపంచమంతా తన అరచేతిలోనే ఉన్నట్లు నమ్మిస్తుంది
తనంత గొప్పవారు ఎవరూ లేరని భ్రమింప చేస్తుంది
ఎక్కింది సైకిలైనా ఊహల్లో ప్రపంచాన్ని చుట్టేయిస్తుంది
మనిషికి వాస్తవానికన్నా ఊహాలోకమే మేలనిపిస్తుంది