"కిరణ పవనం"
"కిరణ పవనం"


గమ్యాన్ని వెతుక్కుంటూ సాధారణ దారిలో ప్రయాణిస్తున్న నా "పవనాని"కి, ఓ కాంతి "కిరణమై" తోడైంది తను.
వెలుగును పంచుతూ...
నాకో సరి కొత్త దారిని చూపింది తను.
మరెందుకో మార్గ మధ్యలోనే,
ఆ కిరణం మాయమైంది.
ముందుకి పోదామంటే, ముళ్ల పొదరిల్లులు చుట్టుముట్టాయి.
వెనకకు వెళ్దామంటే, చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.
తన తోడున్నంత కాలం,
వణుకు పుట్టించే చలి కూడా వెచ్చని కౌగిలైంది.
తన తోడు మాయమైన వేళ,
అందంగా కనిపించే వెన్నెల కూడా నిప్పుల కొలిమైంది.
పద్మ వ్యూహంలో చిక్కుకున్న ఓ ప్రేమ పిపాసి..!
బాటసారిగా ఇప్పుడు నీ గమ్యం ఎటువైపో ?
నా దారిని మార్చేదెవరో..?
దాని తీరును తెల్చేదెవరో...??
- ఓ ప్రేమ పిపాసి
సత్య పవన్ ✍️✍️✍️