"మేఘ తాళం - వర్ష రాగం !"
"మేఘ తాళం - వర్ష రాగం !"
వినీలాకాశపు తెరచాటున
నల్లటి మేఘాలు నాట్యమాడగా,
జల్లుజల్లుమనే చిరు చినుకులు
ఘల్లు ఘల్లుమంటూ మువ్వల్లే —
పుడమి వేదికపై చిందేస్తూ,
ప్రకృతిని పలకరించగా —
నాడులే తీగలై కంపించగా,
హృదయమే మృదంగమై ఆడగా...
ఆహ్లాదమే రాగమై వినిపించగా,
ఆనందమే తాళమై జతచేరగా...
తనువంతా పులకరిస్తూ తడవాలనుండదా?
మనసంతా వికసిస్తూ ఎగరలానుండదా?
ఆలోచనలు స్వేచ్ఛనిచ్చినా —
వయసు మాత్రం బంధికాన చేసేనా?.. 🌦️
-mr.satya's_writings✍️✍️✍️
