" శబరి యాత్ర ! "
" శబరి యాత్ర ! "
తులసి మాల గలగలతో, గురు చరణాల నీడజాడలలో,
మండల దీక్షను పూని, రేయిపగలు పూజలు జరిపి !!
ఇరుముడి కట్టి, కొండలు ఎక్కి, పంబా దాటి,
శరణాగతుడై సాగాను, శబరి గిరిపై చేరాను !!
మెట్టూ మెట్టూ కంటికద్దుకుంటూ, పెద్దెనిమిది పడిమెట్లు పైకెక్కగా,
నీ దివ్యరూపం దర్శనానందమైనది, నీ జ్యోతిస్వరూపం కన్నుల పండగైనది !!
"అనాథ రక్షకనే, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకనే,
అన్నదాన ప్రభువే, హరిహర సుతనే, అయ్యప్పనే
స్వామియే.............................................
శరణం అయ్యప్పా!” అను నామస్మరణలతో
నీ చరణాలకు శరణు మ్రొక్కగా !!
తలచి నడిచి అలుపైనా రాక, సన్నిధి నందు నిలిచి నిన్నే కొలిచా,
సాక్షాత్కరించితిని నా సహృదయముతో, కరుణించ రావా అయ్యప్పా !!
నీ అనుగ్రహమే జీవన ధ్యేయం, నీ నామమే సాక్షాత్ మోక్షం,
ఈ తనువు తాత్కాలికమేమో, పరమ పావనమైనది మాత్రం నా యీ జన్మమే ॥
స్వామియే శరణం అయ్యప్ప !
స్వామియే శరణం అయ్యప్ప !!
రచన : సత్య పవన్ ✍️✍️✍️
