" అక్షర నేస్తం !"
" అక్షర నేస్తం !"
ఆకాంక్షలకు ఆంక్షలు పడిన వేళ
నా ఈ అక్షరాలు సూటిగా కదిలే,
ఆ ఆంక్షలను చీల్చే అస్త్రాలై
అంతరంగపు పోరాటంగా మలిచేలా...
తలపులకు తలుపులు వేసిన వేళ
నా ఈ పదాలు పదునై మెదిలే,
తాళాన్ని కోసే రంపమై
నిశ్శబ్ద ద్వారాన్ని జయించేలా...
ఆఙ్ఞలే గోడలై అడ్డుకున్న వేళ
నా ఈ వాక్యాలు వర్షమై కురిసే,
నేలను తాకే చిరు చినుకై
ఆ గోడను కూల్చే పెను తుఫానులా...
నిర్బంధాలను నేలకూల్చే భావం,
నిర్వచించలేని నాలో ఓ అంతర్భాగం —
ఈ కావ్యాలే నా అసలైన స్వరం,
ఇవే నా జీవన యుద్ధానికి సిసలైన ధ్వజం !
-mr.satya's_writings✍️✍️✍️
