STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"దీపావళి" - కొన్ని జీవిత సత్యాలు

"దీపావళి" - కొన్ని జీవిత సత్యాలు

1 min
12

ఎందుకో చిన్నప్పటి నుండి ఎంతో ఆనందంగా,
మరింత ఆర్భాటంగా జరుపుకునే దీపావళి పండుగ —
ఈ సారెందుకో నా మదిలో
జీవిత తాత్పర్యం తలపించింది...

రివ్వున ఎగిరే తారాజువ్వ —
మళ్ళీ నెలకొరగక తప్పదు కదా !
అలానే,
మనిషి ఎంత ఎత్తుకెదిగినా —
తన మూలానికి తిరిగిరావాల్సిందే కదా !!

చిటపటలాడుతూ శబ్దమేసే టపాసులు —
తర్వాత పుట్టించే నిశ్శబ్ధాన్ని,
ఎంత భయంకరంగా మార్చునో కదా !
అలాగే మనిషి కూడా,
కోపంతో ఉవ్వెత్తున ఎగిరే బదులు —
నిశ్శబ్దంతో స్పందిస్తే,
అది శబ్దానికంటే ఘోరమైన బదులవును కదా !!

చిచ్చుబుడ్డులు, మతాబులు —
కాంతులు విరజిమ్మేను కదా !
జీవితం కూడా అంతే —
కొద్దిసేపు వెలిగే రంగుల వర్ణమాల,
తర్వాత మళ్ళీ మామూలు చీకటే కదా !!

అప్పటివరకూ వెలుగునిచ్చే ప్రమిద —
తన ఆయువు (నూనె) తరిగిపోయిన వెంటనే,
తానే చీకటిని పంచును కదా !
మనిషి కూడా బ్రతికున్నప్పుడు విలువైనవాడు,
తీరా చచ్చాక...
ఎంత ఏడ్చినా లాభమేమీ ఉండదు కదా !!

లక్ష పెట్టీ కొన్న బాణాసంచా —
క్షణాల్లో కాలి బూడిదవును కదా !
మనిషి జీవితం కూడా అలాగే,
ఎంత ఆర్భాటమైనా, ఎంత ఆనందమైనా 
ఊపిరి ఉన్నంతవరకే వెలుగు,
ఊపిరి పోయాక — బూడిదే మిగులును కదా !!

చివరగా…
ఆరుంగులాల అమ్మ గర్భంలో మొదలై,
ఆరడుగుల అవని గర్భంలో ముగిసే ఈ ప్రయాణం —
ఎన్నో రంగులు, మరెన్నో ఒడిదుడుకులు చూసినా,
ఏది కడవరకు మనతో ఉండదు కదా !
అంతా తాత్కాలికమే…
ఆఖరికి ఈ జీవితం కూడా —
అచ్చం ఆ పండగ లాగే కదా !!


-mr.satya's_writings✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract