రకరకాల నవ్వులు (prompt 3)
రకరకాల నవ్వులు (prompt 3)
నవ్వులు పువ్వులై ఆహ్లాదాన్నిస్తాయి
పసిపాపల నవ్వులు సుధలు కురిపిస్తాయి
చిన్నారుల నవ్వులు ఆనందాన్నిస్తాయి
స్వచ్ఛమైన నవ్వులు మదిని అలరిస్తాయి
సాంకేతికత పెరిగి నవ్వులే జవాబు లైనాయి
రకరకాల నవ్వుల ముఖాలు దర్శనమిస్తాయి
మదిలో భావాల్ని నగుమోములే ప్రకటిస్తాయి
పదములు, పలుకులతో ఇంక పనిలేదన్నాయి.