STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Inspirational

4  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

ప్రాణదీపం

ప్రాణదీపం

1 min
376

అన్ని దారులు మూసుకుపోగా

దారీ తెన్ను తెలియక పోగా

మనసంతా అశాంతి మయమై

నిదుర దూరమై, క్షణమొక యుగమై

హోరుగాలిలో ఒరిగే మహా వృక్షంలా

చిరుగాలి తాకిడికే వర్షించే మేఘంలా

ఆలోచన స్థంభించి మనసు భారమై

కదలికలేని హృదయం పాషాణసదృశమై

కోరీకలు, లక్ష్యాలు మాడి మసైపోతుంటే

ఆశలు ఆశయాలు కట్టెదుట కరిగిపోతుంటే

నడిసంద్రంలో కొట్టుమిట్టాడే ఆ సమయాన

తీరం చేరే అవకాశంలా చిన్నపట్టు దొరికిన

ఆ మనిషికదే ఇస్తుంది ఎంతో ఆత్మస్థైర్యాన్ని

అనుకున్నది సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని

కారుచీకటిలో మినుక్కుమనే ఆశాదీపం

అదే మనిషికి బ్రతుకునిచ్చే ప్రాణదీపం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational