కావాల్సిందే!
కావాల్సిందే!


కాలం పెట్టే పరిక్షో
వీధి అందిచే శిక్షో
సమాజం పెట్టే విషమపరినామల్లో
నన్ను నేను
అడగలేక అడుగుతున్న ప్రశ్నో
ఎటువైపు సాగుతుందో
సమాధానం లేని జీవితానికి సాక్షో
అడుగడుగున అంతరాయలా
ప్రయాణంలో నా సహా స్నేహితురాలో
అపనిందలు మోస్తూ వెనక్కి వాలిన
క్షణాన నను ముందుకు నడిపే నా శ్రేయోభలాషో
నేనేంటో నాకంటే ఎక్కువగా
తెలిసిన నా ప్రీయసఖియో
కన్న కలల్ని పులుముకున్న కన్నిరునీ
పన్నిరుగా మలిచి నన్ను అల్లూకొనే నా ధైర్యమోో
ఏమని చెప్పను తన గురించి
ఎలా చెప్పను తన గురి
ంచి
రూపంలేని తానే లేకుంటే
నేను లేనని
తానే లేకుంటే ఈ ప్రతిరూపం
పనికేరాదని
తెలిసిందా ఇప్పటికయినా
తను ఎవరొనని
తెలియకపోతే చెప్పనా
అదే నన్ను ప్రతిబింబించే నా మనస్సాక్షనీ!
ఇంత వరకు చేసింది ఇక చాలని
పరులకోసం నిను చంపుకొక ఇక పదమనీ
చేప్పింది నా మనస్సు
నేడు నాకు చెప్పింది
కాలం పెట్టే పరీక్షలను
అధిగమించి ముందుకు సాగిపో అని
లోకం నికు తోడు లేకున్నా
నీ చితి వరకు నికు నేను తోడస్తనని
చెప్పింది నా మనసు
నేడు నాకు చెప్పింది