తెలుగు తల్లి
తెలుగు తల్లి
తెలుగు తల్లి
వెయ్యి మార్లు చూసిన
తనివి తీరదు నా భాష అక్షర రూపం
గల గల పారే గంగమ్మలా
ఎగసిపడే ప్రవాహమే నా భాష సరళి
పారిజాతాపు అపరాజితమే
నా భాష సుస్వరాల సుమనోహరి
సుగంధ తైలపు పరిమళ పుష్పక్షరాల చెంతకి
ఎగిసిపడుతూ వచ్చాయి గండు తుమ్మెదలు
అక్షర రమ్యత కి అడ్డుకట్ట వేస్తూ
భాషా సరళకి సొరంగం చేస్తూ
పారిజాతాపు పరిమళానికి కళ్లెం వేస్తూ
సవితి తల్లి చేతుల్లో అష్ట కష్టాలు పడుతూ
తన సహజ గుణాన్ని కోల్పోయి
పర భాషాప
ు సంకెళ్ళల్లో నలిగిపోతూ
ప్రసవ వేదనలు పడి
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన
లిపి నీ చరిత్ర సమాధుల్లో కప్పుతున్న
బాషా ద్రోహులకు వినపడటం లేదా
ఆ ఘోష ఇకనైనా?
తేనెలోలోకు భాష మాట్లాడితే
ఫైన్లని,పనిష్మెంట్లని నవ సమాజం
నిర్మిస్తున్న నూతన పోకడలు సమంజసమేనా?
ఆలోచిస్తుందా ఈ లోకం ఓ క్షణమైనా?
కులమతాలు ఎన్నయినా
నా తల్లి భారతమాతే...
ఎన్ని యాసలు,సంస్కృతులున్నా
నా తల్లి తెలుగు తల్లే....
కీర్తి పూర్ణిమ