Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Myadam Abhilash

Classics


5  

Myadam Abhilash

Classics


రమణీయ పిలుపు

రమణీయ పిలుపు

1 min 19 1 min 19

భాగ్యోదయ 

అమృత బాండం 

ఈ మట్టి!

 బహుముఖ సంస్కృతికి 

నిలయం 

ఈ మట్టి!

 విశ్వానికే ఓనమాలు నేర్పిన 

విశ్వగురువు 

ఈ మట్టి!

రాముడి వంటి 

రాజర్షి 

ఈ మట్టి!

కృష్ణుడి వంటి 

కరుణామూర్తి 

ఈ మట్టి!


పసిడి పైరులెన్నింటినో 

పట్టుచీరగా మల్చుకున్న 

పుడమి ఈ పుడమి!

నదీజలాలను ఆనంద భాష్పాలుగా

అలరించిన 

అవని ఈ భారతావని!

సాగరం వంటి విశాల సంప్రదాయం కలిగిన

సరి భూమి ఈ భూమి!


ప్రకృతి చీర పసిడి అంచువై

పల్లె కటి వడ్డాణమై

సంప్రదాయ ఉయ్యాలవై

సమిష్టి కుటుంబ రాగానివై

అనురాగ పందిరివై

అలరించే ఓ భారతావనీ!

నిన్ను మించినదేదేశమూ లేదు!!


అందరినీ ఒకటే చేత

అందరిదీ ఒకటే బాటగా

సాకిన నీ ఆత్మీయ అనుబంధం

కమనీయ కల్పవక్షం

నీ తెలివైన తలంపు తో

అందరినీ ఒక్కటి చేసే

నీ రమణీయ పిలుపు 

*"వందే మాతరం"*

.

*🙏భారతమాత కీ జై🙏*


Rate this content
Log in

More telugu poem from Myadam Abhilash

Similar telugu poem from Classics