ప్రయత్నం
ప్రయత్నం
పద్యం:
బాళిభగము లేక ఫలితమేల, రణము
రాజి లేక రాజ్య విజయ మేల
విత్తు వేయ కుండ విటపి యంటేయేల
పలుకులమ్మ దివ్య భారతాంబ
భావం:
తల్లీ భారతీ! ప్రయత్నం చేయకుండా ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? యుద్ధమూ చేయకుండా, ఒప్పందమూ కుదుర్చుకోకుండా ఊరికే కూర్చుంటే రాజ్య విజయం ఎలా లభిస్తుంది? విత్తనం నాటకుండానే వృక్షం రావాలంటే రాదు కదా!