STORYMIRROR

jayanth kaweeshwar

Classics

5.0  

jayanth kaweeshwar

Classics

సరస్వతీ స్తోత్రం - భావం తో 12

సరస్వతీ స్తోత్రం - భావం తో 12

2 mins
513


సరస్వతీ స్తోత్రం


సరస్వతీ నమః స్వామినీ చేతనానాం వృద్ధిష్ఠితాం

కందస్తాం పద్మయో నేస్తు హిమాకర ప్రియాం

శుద్ధాం మతిదాం వీణా హస్తాం వరప్రదాం

హైం హైం మంత్రప్రియాం హ్రీం హ్రాం కుమతీ ధ్వంస కారిణీం||

సుప్రకాశా నిరాలంబాం అజ్ఞానం తిమిరాప హం

శుక్లాం మోక్షప్రదాం రమ్యాం శుభాంగం శోభనప్రదాం ||

పద్మోపనిష్టాం కుండలీనీం శుక్లవర్ణాం మనోరమాం

ఆదిత్య మండలే లీనాం ప్రణమామి హరి ప్రియాం ||

ఇతీ మాసం స్తుతానేన వాఘ్రుశేన మహాత్మానాం

ఆత్మానం దర్శయో మాశా శరదిందు సమప్రదా

అనేన పద్మ పురాణేన సరస్వతీ స్తోత్రం సంపూర్ణం ||


సంకలనం : కే. జయంత్ కుమార్ ( కవీశ్వర్ )


భావం : " ఓ సరస్వతీ దేవి ! ఓ న స్వామినీ మీకు నమస్కారములు . చేతనత్వమును అభివృద్ధి పరిచెడు మీ కమల కోమలములైనటువంటి కరకమలముల చల్ల ద నాన్ని ప్రియమైనదిగా ఇచ్చేటటువంటిది అయినచల్లని కారుణ్యమును వ ర్షించే  తల్లి మీకు దనము. 

అంతే కాకుండా సకల జీవుల యొక్క బుద్ధిని బుద్ధిని మతిని జ్ఞానాన్ని శుద్ధపరచి మనకు అభివృద్ధి దాయకమైన మార్గ నిర్దేశనమును

చేయునట్టి వాగ్దేవీ మీకు నా నమోవాకములు . దానితో పాటుగా కచ్చ్యపి వీణను చేతిలో ధరించి దానిని మీటుతూ సకల జనులకు అవసరమైన లలిత , సంగీత , గాన , నృత్య ,పలువిధములైన కళలను వరాలు గా ప్రసాదించే దేవి మీకు నా అభివందనం .

"హైం" కారమంత్రము ను ప్రియము గా ఇష్టపడే నీకు

"హ్రీమ్ - హహ్రమ్"అనే బీజాక్షరాలను మమననం చేస్తే కుమతిని, జడమతిని, చిత్త చాంచల్యాన్ని ,  దుష్ట- దుర్మార్గపు ఆలోచనలను ధ్వంసము చేయునట్టి ఓ దేవి మీకు నా నమః పూజా సుమాలు . నిరాలంబనగా మంచి ప్రకాశవంతమైన వవిధముతో మా లోని అజ్ఞానమనే చీకటిని ( తిమిరాన్ని ) హరించి వేస్తుంది.

 చల్లని చంద్రుని వెన్నెల వలే మోక్షాన్ని ప్రసాదించే దేవి ,రమ్యమైన , రమణీయమైన కమనీయమైన , పరిశుభ్రమైన , అంగ సౌష్టవాన్ని కలిగి శ్వేతవర్ణము గల వస్త్రములను ధరించి నట్టి విరించి పత్నీ మీకు నమః సుమాంజలులు.

 శ్వేత పద్మము పై ఆసీనురాలవై ఆసీనురాలవై కుణ్డలీని యోగవిద్యయందు ఉండి ఉండి ,

తెల్లని కాంతితో( ధవళ) మేని ఛాయతో వెలిగిపోవు మీ శుభములనిచ్చు అంగములచే శోభనప్రదమై ఉంటుంది.

 అంతే కాకుండా మనస్సులో కూడా సంచరించి మాకు ముదాన్ని గొల్పుతున్నావు .

సూర్య మండలములో శ్వేతాకిరణాలను వెదజల్లే హరిప్రియ వైన నీకు ప్రణామములు అర్పిస్తున్నాను. 

ఈ విధముగా అన్ని మాసాలలో స్తుతించిన వారికి వాగ్రూపములో నీవి మహాత్ములవడానికి తోడ్పడుతావు. 

మా యొక్క ఆత్మలలోనే మిమ్ములను దర్శించుమేము మాతా శరత్కాలంలో పరిపూర్ణ చంద్రుని వదనంతో ఉన్న ప్రభావవంతమైన మీ ముఖ కమలాన్ని ఎల్లప్పుడూ దర్శించుకుని పూజించుకుంటాము . అదేవిధముగా పద్మ పురాణములో నున్న ఈ స్తోత్రాన్ని ఎల్లప్పుడూ స్మరించి పఠిం చి గానము చేస్తే సర్వ కళలు,సర్వవిద్యలూ అర్హులైనవారికి అవశ్యము సిద్ధించు నని భావము .

  " వాగ్దేవైచ విద్మహే విరించి పత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ "


Rate this content
Log in

Similar telugu poem from Classics