అమ్మ భాష
అమ్మ భాష
పద్యం:
రామదాసు పలుకు రమ్యమైన తెలుగు
రామ నామ ముండు రమ్య ముగను
అన్నమయ్య పదము అమ్మ భాష తెలుగు
వెంకటేశుడిచ్చు వరము వేలు
భావం:
రమ్యమైన రామ నామం పలికిన రామదాసు పలుకులు తెలుగులోనే.. వెంకటేశ్వరుడు ఇచ్చిన వేల వరాలతో అన్నమయ్య పదాలు కూడా అమ్మ భాష తెలుగే.