మాతృదేవోభవ
మాతృదేవోభవ


అమ్మా! శుభలక్ష్మివై “నంది ఘోష్” నధిరోహించి జగన్నాధునితో సహజీవనగమనాన్ని సాగించి
మా నలుగురికి జన్మనిచ్చి ఆ నాలుగు పుష్పాలను జగన్నాధుని పాదాలచెంత కానుకగా సమర్పించిన మాతృమూర్తి నీకివే మా పుష్పాంజలిలు
అమ్మా ! ఉగ్గు పాలలో దైవచింతనామృతాన్ని రంగరించి గ్రొలింపజేసిన బ్రహ్మ విష్ణు శివాత్మికైన కాళీమాతాస్రితా నీకివే మా ప్రణమాంజలిలు
అమ్మా ! మా చేయిపట్టి సరస్వతీ స్వరూపిణివై
మాకక్షర జ్ఞానానందించిన మా తొలి గురువైన వాగ్దేవి నీకివే మా కుసుమాంజలిలు
అమ్మా ! నీ జీవనాడులను వీణాతంత్రులుగా మీటి మమ్మల్నలరించి మురిపింపజేసిన త్యాగమూర్తీ నీకివే మా స్మృత్యాంజలిలు, నమఃసుమాంజలిలు
అమ్మా! మాకు అష్టైశ్వర్యాలు నొసంగి ఆ జగన్నాధుని సన్నిధానం చేరేవేళ నారాయణమనోహరి
నీకివే మా కృతాజ్ఞతాంజలిలు, శ్రద్ధాంజలిలు, అశృనివాళిలు
అమ్మా! మరుజన్మలో నీకు అమ్మనై పుట్టి నీ ఋణం తీర్చుకునే ఈ నా చిన్న కోరిక తీర్చమని
నీ వైకుంఠవాసునికి విన్నవించమని
నీ పాదపద్మమ్ములచెంత వేడుకొందు …….
****💐💐💐*****