ద్వాదశ లింగేశ్వర స్తుతి
ద్వాదశ లింగేశ్వర స్తుతి
ఉలి పట్ట శిల్పినిగానైతిని ఏ రూపమున నిను గొలిచెదనో
నన
ఎదురుగ నున్న బండ రూపమైననూ చాలు
సంతసిస్తినంటివి సోమేశ్వర
నిను ఏమని వేడెదనో శివ నిను ఏమని పొగడెదనో
పంచామృత స్నానమొనరించ పైకము లేనివాడిని
ఏ విదిన నిను అర్చించెదనో నన
ప్రక్కనే పారుతున్న సెలయేటిని దోసిట పట్టి నెత్తిన పోస్తే పరవశించిపోయే పరమశివా శ్రీశైలమల్లికార్జునా
నిను ........
నిను పూజించ పున్నాగ, పారిజాతాలైనా లేవని చింతించ
మారేడైన, జిల్లేడు పూలైనా చాలంటివి కదా గిరీశా, మహాకాళేశ్వర నిను ...... నీ సేవకు పట్టు పీతాంబరాలు నేయ సాలివాడను కానన
వేటాడిన పులి చర్మమే సంతసముగ ధరియించిన చర్మాంబరధర ఓంకారేశ్వర నిను ........
నిను సమర్పించ క్షీరాన్నము తేలేక పోతినన
పచ్చిమాంసమే పంచభక్షాలుగా స్వీకరించిన పరమశివా, కాళహస్తీశ్వరా నిను .......
నిన్నలంకరింప ఆభరణాలు సమకూర్చలేనంటే
కాలసర్పాన్నే కంఠాభరణంగా దాల్చిన నాగేశ్వర, భీమశంకర నిను ....... నిను సేవింపగా వచ్చ్చిన గిరి బాలనే పరిణయమాడి
&
nbsp; నీలో సగభాగమిచ్చ్చిన అర్ధనారీశ్వర, త్రయింబకేశ్వర నిను ......
నీ నామమే గానము చేసే నల్ల కోయిలమ్మకు తీపి రాగాలిఛ్చిన నీలకంఠ నిను .....
కడలిని మధియించి హాలాహలమ్మునే చూసి హడలిన జగతికి
ఆ గరళమ్ము నీ కంఠంబున ధరియించిన జగద్రక్షకా జగదీశ్వర, ఘృష్మేశ్వర నిను...... నీ పవళింపు సేవకై నే తెచ్చ్చిన పట్టు పానుపునే త్యజియించి స్మశానమే నీ నివాసము చేసుకుని బూడిదనే విభూదిగా ధరియించి
ఆనంద తాండవమాడిన నటరాజేశ్వర, వైధ్యనాదీశ్వర నిను ......
నీ చరణమునే శరణు జొచ్చ్చిన వానికి యమపాశమునే మరలించి
కడతేరే వానికి కడదాక ఆయువిఛ్చిన మృత్యుంజయ రామేశ్వర నిను ...... నే నీ పాంక్షాక్షరీ స్తుతియించ అన్నపూర్ణా సమెతుండవై విచ్చేసి వరాలిచ్చ్చిన కాశీవిశ్వేశ్వర నిను ఏమని వేడెదనో శివ నిను ఏమని పొగడెదనో
ఏమని వేడెదనో శివ నిను ఏమని పొగడెదనో
******💐💐💐******