అక్షరార్చన
అక్షరార్చన
అక్షరార్చన
నీ పాదాంబుజములనే స్మరియించ
నాకక్షర జ్ఞానానందించి అక్షరార్చన సేయ సాయమందించవా
దేవి అక్షర నినువినా నాకు తోడెవ్వరు
వేణునాధునిచే తొలుత కొలవబడిన వీణావాణి
బ్రహ్మ జిహ్వపై వసించిన బ్రహ్మకన్యక భాషాలక్ష్మీ
బ్రహ్మవైవర్త, పద్మ పురాణాలలో
ఋగ్వేద, దేవి భాగవతంలో
కీర్తింపబడిన వాగ్దేవి హంసవాహిని
నిన్ను నా హృద్మందిరాన నిరతము గొలుతు
నీ పాదాంబుజములనే స్మరియించ
నాకక్షర జ్ఞానానందించి అక్షరార్చన సేయ సాయమందించవా
దేవి అక్షర నినువినా నాకు తోడెవ్వరు
కచ్ఛపి పుస్తకధారిణి
సంగీత సాహిత్య వరప్రదాయని
చంద్రబింబానన, సితతామర వస్త్రధారణి
కువలయనేత్రీ, నీరజాక్షి, నీలకుంతల,
సరసీరుహ వాసిని, నిత్యదరహాసిని
నిన్ను నే సదా స్వరార్చన గావింతు
నీ పాదాంబుజములనే స్మరియించ
నాకక్షర జ్ఞానానందించి అక్షరార్చన సేయ సాయమందించవా
దేవి అక్షర నినువినా నాకు తోడెవ్వరు
మరాళ మల్లికహారధారిణి
తుషార ఫేన రజితాచల ధవళాంగి
కుంద మందార సుధ పయోధి అంబుజవాసిని
విదుషిమణి వీణాపాణి
శుభకారత సుకుమారి శారదాదేవి
సతతము నిన్నే స్మరియింతు
నీ పాదాంబుజములనే స్మరియించ
నాకక్షర జ్ఞానానందించి అక్షరార్చన సేయ సాయమందించవా
దేవి అక్షర నినువినా నాకు తోడెవ్వరు
అక్షరాన్ని నమ్ముకున్న పోతనకు పూట గడవక
అక్షరాన్ని అమ్ముకునే ఆలోచింప
చలించి కాటుక కన్నీరు చిందించి
పోతనను విరమింపజేసిన
అక్షరకు నా హృద్మందిరాన అన్ని వేళలా
అక్షరార్చన గావింతు
దేవి అక్షర నినువినా నాకు తోడెవ్వరు
నీ పాదాంబుజములనే స్మరియించ
నాకక్షర జ్ఞానానందించి అక్షరార్చన సేయ సాయమందించవా
దేవి అక్షర నినువినా ఈ శశిధరునికి తోడెవ్వరు
