STORYMIRROR

Devi Sree

Classics

4.3  

Devi Sree

Classics

అమరావతి

అమరావతి

1 min
355


అమరావతి నగర శిల్ప కళాచాతురత; 

చాటి చెప్పెను ప్రపంచముకు తన ఘనత,

 

ప్రతి మనిషి తప్పక చేయవలసిన యాత్ర;

చేస్తే తెలుస్తుంది అమరావతి ప్రాముఖ్యత,


ప్రాచీన సంస్కృతిని తరతరాలకు అప్పగింత;

ఇచట అందరికీ లభ్యమట ప్రశాంతత,


శిల్పులకు ఎల్లప్పుడు తోడుందట దక్షత;

ఇదే కళామతల్లికి శిల్పులు ఇచ్చే కౌగిలింత,

 

శాతవాహనుల వల్ల పెరిగెను నాగరికత ;

వీరి అభివృద్ధి పెంచెను అమరపురి ప్రాముఖ్యత ,


బుద్ధ పాద ధూళి చే వ్యాపించింది పవిత్రత;

అందరికీ బుద్ధదేవుడు ఓ దేవదూత ,


ఇంద్రుడు స్థాపించెను లింగమిచ్చట;

నేడిది పుణ్యక్షేత్రమే వెలుగుతున్నదట ,


నవ్యాంధ్రప్రదేశ్ కు నవ ప్రజారాజధాని;

అమరావతే ఆ ప్రదేశ నామకర్ణమని .


Rate this content
Log in

More telugu poem from Devi Sree

Similar telugu poem from Classics