కోదండ రాముడే తలదించెనే
కోదండ రాముడే తలదించెనే



నును సిగ్గుల సీత బుగ్గలు మల్లె మొగ్గలాయే
ఆజానుబాహుడా రాముడే దరి చేరగా
పూబాల తన వలపుతో కూర్చేనేమో
ఆ మాల
తానెంత వయ్యారాలు పోయే
ఆ మోహనాంగుడి ఊపిరి
సోకినంతనే
తా తరుణినని మరచి భూజాత తన్మయత్వమున కాంచె
మన్మథాకారుని కనురెప్పవేయక
ఏమంత వీరుడా కోదంక రాముడు!!
మా సీతమ్మ చూపులకే
తలదించినాడు
...........భాగ్య శ్రీ ✍️