అభిలాష
అభిలాష
వేవేల వెన్నెల తుంపర్లు
కరుగుతూ రేపెను తలపులు
ఎగసే కెరటాల పోటీపడే
గుండె చాటు అలజడులు
కలల కౌగిలి దాటి
కనుల వాకిలి చేరనని కవ్వించి కలవరపెట్టే
పరిపరి పడి పడి ప్రయత్నించకుంటే
పట్టుపడనని పరిహసించే
ఒక్కసారిగా
ఉడుకు నెత్తురు విరుచుకపడి
ఉవ్వెత్తున ఎగసే
ఊపిరి గాలులలో నా సంకల్పం ప్రతిధ్వనించగా
ప్రతిఘటించ వీలులేక
పరుగు పరుగున నను చేరే
నా ఆశలు!! అభిలాషలు!!
..........భాగ్య శ్రీ ✍️