నా అక్షరాలు
నా అక్షరాలు
నాలో రగిలే జ్వాలకి
మంచు వర్షం కురిపించినా
పెదవంచు నవ్వుకి
పరిమళం అందించినా
చిగురించిన ప్రేమకి
వెన్నెల జత చేసినా
గుండె లోతులని తవ్వినా
గుక్కపట్టి ఏడ్చినా
నా ఆత్మను తన బిగి కౌగిట బంధించేవి
అక్షరాలే
లక్షణాల నా అక్షరాలే
........భాగ్యశ్రీ ✍️