అమ్మ ఒక వరం
అమ్మ ఒక వరం
పలికే తొలి పలుకు "అమ్మ"
తాకే తొలి స్పర్శ "అమ్మ"
ఒకప్పుడు,
తియ్యటి అమ్మ పిలుపుతో మొదలయ్యే ప్రతి వేకువ...
ఇప్పుడు,
"అమ్మ పిలుపు" అనే ఆలోచనతో మొదలవుతుంది.
కమ్మటి అమ్మ స్పర్శతో ముగిసే ప్రతి రేయి...
ఇప్పుడు,
"అమ్మ స్పర్శ" అనే ఊహతో ముగుస్తుంది.
అమ్మంటే రెండక్షరాల "తియ్యని పదం"
అమ్మంటే జన్మజన్మల "పుణ్య ఫలం"