Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

" మగాడికి కష్టాలేం ఉంటాయ్ ! "

" మగాడికి కష్టాలేం ఉంటాయ్ ! "

2 mins
330


" మగాడికి కష్టాలేం ఉంటాయ్ !!


పుట్టడంతోనే అదృష్టవంతుడంటూ అందలం ఎక్కిస్తారు !


ఎదుగుతున్నకొద్ధీ ఆ అందలం అందుకోకపోతే ఆక్షేపిస్తారు !!


నచ్చిన దాంట్లో స్థిరపడమనే అధికారమే కరువు !


నచ్చని దాంట్లో స్థిరపడితే జీవితమే ఓ బరువు !!


హుమ్... !


మగాడికి కష్టాలేం ఉంటాయ్ !!


ప్రేమించిన అమ్మాయిని మోసగిస్తే నేరస్థుడు !


ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోతే వెర్రోడు !!


పెళ్లికి కట్నం తీసుకునేవాడు అడ్డ గాడిద !


పెళ్లికి కట్నం వద్దనేవాడు వింత పశువు !!


హుమ్... !


మగాడికి కష్టాలేం ఉంటాయ్ !!


నలుగురి మాట పెడ చెవిన పెడితే అహంకారి !


నలుగురు చెప్పే చెప్పుడు మాటలు వింటే అంధకారి !!


కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే ముంచేస్తారు !


కూడబెట్టిన డిగ్రీలతో ఉద్యోగం చేస్తే బానిసలా చూస్తారు !!


హుమ్... !


మగాడికి కష్టాలేం ఉంటాయ్ !!


కష్టమొచ్చినా తట్టుకుని నిలబడితే చలనం లేనోడు!


కన్నీరొచ్చి బాధ బయటకి చెప్తే భావోద్వేగం కలవాడు !!


కుటుంబ బాధ్యతలకు తలొగ్గితే చేతకాని వాడు !


పోటీ ప్రపంచంతో పరిగెడితే స్వార్థ పరుడు !!


హుమ్... !


మగాడికి కష్టాలేం ఉంటాయ్ !!


పెళ్లాం మాట వినే కొంగు చాటు మొగుడైతే సంసారి !


తల్లి మాట వినే అమ్మ చాటు బిడ్డైతే కుసంస్కారి !


ఇష్టపడి తెచ్చుకున్న దానికి తోడుగా కాలమనే ఎక్స్పైరి డేట్ !


కష్టపడి సంపాదించుకున్న దానికి జతగా దురదృష్టమనే మాన్యుఫాక్చరింగ్ డేట్ !!


హుమ్... !


మగాడికి కష్టాలేం ఉంటాయ్ !!


" అయినా...


మగాడికేం తెలుసు ఆడదాని బాధల గురించి ! "


అంటూ తేలిగ్గా అనేస్తుంది తప్ప ఈ లోకం...


తనని సృష్టించిన ఆడది ,


తనతో తోడబుట్టిన ఆడది ,


తనని నమ్ముకున్న ఆడది ,


తనతో సృష్టించబడిన ఆడది


ఇలా తన చుట్టూ ఉన్న ప్రతీ ఆడదీ బాధ పడకుండా ఉండడం కోసం ప్రతీ మగాడు తను పడే ప్రతీ కష్టం గురించి ఈ లోకం ఒక్కసారైనా ఆలోచిస్తే బాగుండేదేమో !


ఆడదాని అందాన్ని వర్ణించే మగ కవులకి


అక్షరాలు కో-కొల్లలేమో కానీ,


ఓ కొడుకుగా తాను పడిన కష్టాలు


ఓ భర్తగా తాను తీసుకున్న బాధ్యతలు


ఓ తండ్రిగా తాను మోసిన బరువులు


చివరికి వృద్దాప్యంలో తాను పంచే ఈ అనుభవాల సమ్మేళనాలు


ఉద్యోగ ఒత్తిళ్లు, వ్యాపార నష్టాలు, కుటుంబ భారాలు


ఇలా ఒక్కటేమిటి ?


ప్రతీ మగవాడి కష్టం కవయిత్రులు వర్ణించాలంటే మాత్రం


వాక్యాలు కూడా అలసిపోతాయేమో ?


తల్లడిల్లి కన్నీరే కారుస్తాయేమో ? ? "


- mr.satya's_writings



Rate this content
Log in

Similar telugu poem from Abstract