"నిరీక్షణ !"
"నిరీక్షణ !"
కనిపించని కష్టాల ముసుగులో,
కనుమరుగైన ఇష్టాలెన్నో!
విలవిలలాడుతున్న బాధల నీడలో,
వెలవెలబోయిన ఆశలెన్నో!
గెలుపు పిలుపు కోసం
తట్టిన తలుపులెన్నో...
తలుపులు తెరవక
ఆగిన అడుగులెన్నో...
కాలంలో కలలు కరిగిపోతూ,
కన్నీటికి బాటలుగా మారిపోతూ...
అర్ధమయ్యేలోపే ఈ ఏకాంతం,
అంతులేని మౌనంగా మిగిలే ఆసాంతం !
కాలు కదలకపోయినా...
మనసు మెదలకపోయినా...
గాయాల ఊసులు వెక్కిరించినా...
గతాల గాథలు వెంటాడినా...
ఆశల ఆకులు మళ్ళీ చిగురించకపోతాయా ?
కలల రాగాలు మళ్ళీ పుణికించకపోతాయా ?
నవకిరణం తక్కువయిందని,
సూర్యోదయం ఆలస్యమయ్యేనా ?
