స్మరించాలని ఉంది
స్మరించాలని ఉంది
1 min
118
నింగి కి నేత్రం
సూర్యుడైతే
పుడమికి అందం
ప్రకృతైతే
జీవానికి ప్రాణం
వాయువైతే
జీవకోటికి
గొడుగువు నీవు
అందుకే నిన్ను
సేవించాలని ఉంది
స్మరించాలని ఉంది
నేనెందుకు పారాలని
నది నిట్టూరిస్తే
కరువు కమ్మేయదా
నేనెందుకు కష్టించాలని
మనిషి ఆగిపోతే
జీవితం జీర్ణిస్తుందా
నేనెందుకు వీయాలని
గాలి గోల చేస్తే
జీవి గాలిలో
కలిసి పోడా
అందుకే
నిన్ను
సేవించాలని ఉంది
తల్లీ భారతీ
నిన్ను స్మారించాలని ఉంది