వేసవి
వేసవి
శీర్షిక: భూమి వేడెక్కుతుందా??
భూమి వేడెక్కుతుందంటే నమ్మలేదు
భూ కాలుష్యం పెరుగుతుందంటే అస్సలు నమ్మలేదు
భరతమాత నుదుట తిలకం లా ఉన్న రవి, కాళిక చేతిలో మరణించిన మహిషాసురుడి నెత్తురు బొట్టులా మారాడు.
చుట్టూ ఉన్న అగ్నిపర్వతాలు ఒకేసారి పేలినట్టనిపించింది.
రోడ్డు పై నడుస్తుంటే జాతరలో నిప్పుల గుండం తొక్కినట్టనిపించింది.
భానుడి ప్రతాపం అందరి పై ఒకేలా ఉంటుందనుకున్న కానీ అది విధి నిర్ణయమైతే అలా ఎందుకుంటది!
భవనాల్ల ఉన్నోళ్ళు ఎసిల కింద ఖుషీ గా ఉన్నరు.
రేకులింట్ల ఉన్నోళ్ళు పెనం మీది నీటి బిందువోలె ఆవిరైతున్నరు.
పూరి గుడిసె
లున్నోళ్ళేమో నూనెలో వేయిస్తున్న బజ్జీల్లా కాలుతున్నరు.
ఇక రైతన్ననేమో చెమట అనే సంద్రం లో మునిగిన పడవలా తడిసిండు.
మగ్గం పైనున్న నేతన్నను చూస్తుంటే సూర్యుడి రథసారథి లా కనిపిస్తుండుు.
ఒళ్ళంతా నీరు కారుతుంటే నీళ్ల కోసం చీమల్లా బారులు తీరారు పల్లె ప్రజలు.
జనం నీటి కోసం పోట్లాడిన తీరు మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపించింది.
పొద్దంతా మండిన సూరీడు పొద్దుముక్కంగనే చల్లబడిపోయిండు.
ఆ సాయంత్రం పడిన మామిడి జల్లులకు ధరిత్రి జర సల్లగైంది.
కాలుతున్న పెంచుమీద నీళ్ళు పోస్తే వచ్చిన పొగల్లా కనిపిస్తుంది.
అప్పుడు తెలిసింది నిజంగా భూమి వేడెక్కుతుంది అని!!!