మాట
మాట
పద్యం:
అమ్మ మాట వుండు ఆనందమయముగా
నాన్న మాట వుండు నవనితముగ
గురువు మాట వుండు గుర్తించు విధముగా
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! అమ్మ మాట ఆనందంగా ఉంటుంది. నాన్న మాట వెన్న లాగా ఉంటుంది. గురువు మాట సమాజం నిన్ను గుర్తించే విధంగా ఉంటుంది.