దర్శనం
దర్శనం
చిరునవ్వుల తల్లి కదా
మా అలర్మేల్ మంగా
నీ సిరి మువ్వల సందడిలే
మాకు సంతోషంగా....
నిను చూసే భాగ్యము
మాకెవరికి లేక
క్షణమొక యుగంగా
గడిపేస్తున్నాం..
సుప్రభాత సేవతో నిను మేల్కొలిపి
అర్చన హారతిలతో
నిను సేవించి
ఎన్ని రోజు లాయె తల్లి
నీ దరి చేరి
నీ సేవకు మాకు ఇవ్వు
అనుమతినమ్మా..
శుక్రవారమభిషేకం నీ తోటల్లో
సహస్ర దీపాల వెలుగులో మెరిసే తల్లీ
నిను చూడక పోతున్నాం అలర్ మేల్ మంగా...
మాకెప్పుడు దొరుకునో
నీ దర్శన భాగ్యం...
గోవిందా గోవిందా అన్న పిలుపులు లేక
జరగండి జరగండి అన్న
మాటలు లేక
గుడిలోన వెంకన్నకు
శ్రవణానందం కరువాయే ..
వేదపాఠశాల విద్వత్తుల
వేదపఠనం
టీటీడీ సిబ్బందులు పాలుపంచుకోవడం హర హర నయ నయ
పచ పచ మధ మధ
మంత్ర ఉచ్ఛరణం
అందరికీ ఉత్తేజం.
రోజువారి కైంకర్యం
గోవిందుని కానందం
ప్రతీ రోజూ శ్రీ వారికి
కళ్యాణం కమనీయం
పనిఒత్తిడి కాస్త తగ్గి
పాలకులకు భారం తగ్గి
రాబోయే రోజులలో
గోవిందుని దర్శనంకు
ఏర్పాట్లు చేయడంలో
ఎవరి పాత్ర వారేమో
పోషించడం చూస్తున్నాం..
ఏడుకొండలనెక్కనీక
గోవిందుని కానలేక
మనో వేదనతో మేం
కాలం గడుపుతున్నాము..
ఓ మాధవా కేశవా
మా మొరను ఆలకించవా
ఎంత త్వరగా వీలయితే
మాకు మీ దర్శనం చూపవా...
రాబోయే రోజులలో
మీకు నిద్రేమో కరువాయే
అంతవరకు గోవిందా
హాయిగా నిదురపో..