రచయిత
రచయిత


కలలోనైనా కలం కదలదే
ఘడియ ఘడియకు చూస్తున్నా
మది నిండా ఆశలు ఉన్నా
మరు మాటకు కలం కదలదే అన్నా..
చిన్నప్పుడే చెప్పారు పంతులయ్యవారు
చూసిరాయడం తప్ప నీకు చేతకాదు
ఏ ముహూర్తాన చెప్పారో కానీ
పత్రాల రచయితగా
(డాకుమెంట్స్ రైటర్ )
స్థిరపడ్డనేను
పంతులయ్యను తలచని రోజులేదు..