Rajagopalan V.T

Others

5  

Rajagopalan V.T

Others

సేవలు

సేవలు

1 min
32


అలర్మేల్ మంగకు అనుదినము 

సేవలు చేయుట మా భాగ్యము 

అందరి తరపున అందిస్తున్నాం అందుకోవే మా ఇలవేల్పు.. 

అలర్మేల్ మంగకు అనుదినము 

సేవలు చేయుట మా భాగ్యము 

అందరి తరపున అందిస్తున్నాం అందుకోవే మా ఇలవేల్పు.. 


చిక్కటి పాలతో గడ్డ పెరుగుతో 

కొబ్బరి నీటితో, కమ్మని తేనెతో 

పంచామృతము పసుపు గంధముల 

పన్నీరు తీర్థము తో అభిషేకం 

నీకు పన్నీరు తీర్థముతో అభిషేకం 

అందరి తరపున అందిస్తున్నాం అందుకోవే మా ఇలవేలుపు 


పట్టుచీరల సారెలతోనూ 

వజ్ర వైడూర్య ఆభరణాలతోనూ 

మల్లి రోజా సంపంగి మాలలు 

అందరి తరపున అందిస్తున్నాం 

అందుకోవా మాఇలవేలుపు.. 


ధూప దీప నైవేద్యాలిచ్చి 

నీ కలసట లేక చూస్తున్నాము 

అన్నమయ్య, త్యాగయ్య పాటలు 

నాదస్వరంతో వినిపిస్తున్నాం 


అందరికీ నీ అభయహస్తము 

అందించవే మా అలర్మేల్మంగా.. 

చిక్కటి పాలతో గడ్డ పెరుగుతో 

కొబ్బరి నీటితో, కమ్మని తేనెతో 

పంచామృతము పసుపు గంధముల 

పన్నీరు తీర్థము తో అభిషేకం 

నీకు పన్నీరు తీర్థముతో అభిషేకం 

అందరి తరపున అందిస్తున్నాం అందుకోవే మా ఇలవేలుపు 


పట్టుచీరల సారెలతోనూ 

వజ్ర వైడూర్య ఆభరణాలతోనూ 

మల్లి రోజా సంపంగి మాలలు 

అందరి తరపున అందిస్తున్నాం 

అందుకోవా మాఇలవేలుపు.. 


ధూప దీప నైవేద్యాలిచ్చి 

నీ కలసట లేక చూస్తున్నాము 

అన్నమయ్య, త్యాగయ్య పాటలు 

నాదస్వరంతో వినిపిస్తున్నాం 


అందరికీ నీ అభయహస్తము 

అందించవే మా అలర్మేల్మంగా.. 


Rate this content
Log in