ఎదురుచూపు
ఎదురుచూపు
1 min
333
సేపల ఏటకు ఎళ్లిన మావా
సాలా రోజులయ్యిందేరా
పెతి రోజూ రేతిరి ఐతే
నీ రాకకై చూత్తున్నానే
కచ్చదీవుకెళ్ళొద్దన్నానే
సెప్పినమాట ఇనకపోతివి
సిలోనువాళ్ళు పట్టుకెళ్లారా
సింత నాకు ఎక్కువాయెరా
ఆళ్ళకి తినేకి సరుక్కుల్లేవు
నీకింకేం పెడతారు మావా
అనుకుంటేను ఏడుపొత్తాది
నా వల్ల కాలేదు మావా
బుడ్దోడేమో నాన్న అంటూ
నా పేణము తీస్తున్నాడు
నా మాటలను ఇన్న నీవు
నా మావకు కబురందించు
ఓ గాలిదేవుడా నీకే సెప్పేది
నా మావకు కబురందించు.