తిరనాళ్ళు
తిరనాళ్ళు
ఛల్ ఛల్ గుఱ్ఱం చలాకీ గుఱ్ఱం
ఎక్కడికెళుతున్నావ్
మా ఊరి తిరునాళ్లకేమో రధం ఎక్కుతున్నాం హోయ్ హోయ్ రధమెక్కుతున్నాం..
గల గల గల గల పలుకుల చిలకా
ఎక్కడికెళుతున్నావ్
నీవెక్కడికెళుతున్నావ్
గుఱ్ఱం బావతో తిరునాళ్లకెళ్లి తిరిగొస్తానమ్మా నేను తిరిగొస్తానమ్మా
మెడలో ఘంటలు ఘల్లు ఘల్లు మన గోమాతలమ్మా ఎక్కడికెళుతున్నారు
మీరు ఎక్కడికెళుతున్నారు
మా ఊరి తిరునాళ్లకెళ్లి మా వో
ళ్ళని కలిసొస్తాము మేము మావాళ్ళని కలిసొస్తామ్..
ఏనుగు మావా ఏనుగు మావా ఎక్కడికెళుతున్నావ్
పచ్చని శాలువా నీకే అందం మిల మిల మెరిసేనే
మా ఊరి తిరునాళ్లకెళ్లి అమ్మవారిని అందల మెక్కిస్తా
చిట్టి పాపలకు ఆనందం ఇచ్చేకి
తిరనాళ్ళకెళుతున్నా నేను తిరనాళ్ళకెళుతున్నా..
కోయిలమ్మలు మీరు కూడా
అక్కడికేనా..
ప్రసాదు గారి పాటలు వినేకి
తిరనాళ్ళకెళుతున్నాం మేము తిరుపతికెళుతున్నాం...