చెరగని బంధాలు..
చెరగని బంధాలు..


రాఖీ కడుతున్న చేయి కోరుకోదేమీ మీ నుండి..
ఆ రాఖీ పట్టుకుని మీ ముందు నుంచుని ఉన్నాను అంటే అర్ధం నా సోదరుడి విజయాన్ని ఈ సోదరి కాంక్షిస్తుందని..
మీరు ఇచ్చే చిరు కానుక ఆశించే ఆశ లేదు.. ఏ కష్టమైనా నీకు అండగా నీలుస్తాననే ప్రమాణాలు ఆశించను నా ప్రియమైన సోదరా..
మీ నుండి కోరుకునేది ఎన్నేళ్ళైనా, ఎన్నాళ్ళైనా చేరిగిపోనీ మీ చిరునవ్వు..
ఆ చిరునవ్వు చాలు నా వాళ్ళు బాగున్నారు అనే ఆనందంతో నా మెట్టినింట బతికేస్తా ఏ చింత లేకుండా...
ఎందుకంటే.. ??
కాలం మారినా..
దూరం పెరిగినా..
చెరగని బంధాలు మనవి..
ఈ సోదరి చీకటికి భయపడదు, కష్టానికి క్రుంగిపోదు కాని మీ నుండి దూరానికి భయపడుతుంది..
ఈ అన్న చెళ్లెళ్ళ భంధం, అనుబంధాలు కలకాలం నిలవాలని, నా సోదరుడు ఎప్పటికి సంతోషం ఉండాలని ఈ రక్షాబంధన్...
ఈ నూలుపోగులే కడుతున్న నీ జీవితమంతా అద్భుతంగా సాగాలని కోరుకుంటు..
Women’s Diary..