నువ్వే నా ధైర్యం...
నువ్వే నా ధైర్యం...
1 min
337
చిటికిన వెలు పట్టుకుని
తప్పటడుగుకులు వేస్తు
చూసిన ఈ అందమైన లోకం
నేడు వికృత రూపం దాల్చింది
కట్నమనే కాలసర్పం కాటువేయగా
మూడుముళ్ల బంధం
సప్తపదుల ప్రయాణం
అగ్ని దేవుడి సాక్ష్యం
శాపమైన ఈ క్షణానా
తలంబ్రాలే నిప్పురవ్వలై
దేహాన్ని దహిస్తున్న ఈ సమయాన
దైర్యం సరిపోవడం లేదు
ఒక్కసారి నీ వెలు అందించవా నాన్న
ఊపిరి వదిలేస్తాను దైర్యంగా
భరించలేను ఈ మంటల తాపాన్ని
Women's Diary...