STORYMIRROR

Women's Diary

Tragedy Crime Inspirational

4  

Women's Diary

Tragedy Crime Inspirational

బ్రతకాలని ఉంది..

బ్రతకాలని ఉంది..

1 min
388


కళ్ళు మూసి తెరిచేలోపే

ఆవహించిన గ్రహణం

తలకిందులైన జీవితం

అలజడి లేదు హృదయానికి

స్పర్శ లేదు దేహానికి


ఛిద్రమైన నా ముఖాన్ని చూసి

ఈ లోకం అడుగు వెనక్కి వేసింది

నన్ను కన్న ప్రేగు విచ్ఛిన్నమైంది

అయినా బ్రతకాలని ఉంది


నా రుపాన్ని నా నుండి లాగేస్తూ

నా ప్రపంచంలో నా ఉనికిని చెరిపేస్తు

ఆశలని కాల్చేస్తూ చీకటినే మిగిల్చినా

బ్రతకాలని ఉంది


భవిష్యత్తుపై వేసిన మచ్చలు

నా ఈ వికృత రుపాన్ని చూసి

సడలనివ్వను ఆత్మస్థైర్యాన్ని

అదరివ్వను ఈ గుండె ధైర్యాన్ని


అద్దంలో వణుకుతున్న ప్రతిబింబం

నా ఆలోచన వేగం పెంచుతూ

కడలిలో అలలై ఎగసిపడుతున్నాయి

న్యాయాన్ని కొనలేనని తెలిసి

పోరాటం చేయమని

నాకై నన్ను నాలోని నాకోసం

ముందడగు వేయమని

జీవితం చూపిన దారిలో వెళ్ళమని






Women's Diary...


Rate this content
Log in

Similar telugu poem from Tragedy