బాగున్నావా
బాగున్నావా


బాగున్నావా
అంతకంటే ఏం అడగాలో తెలియలేదు
నేను బాగున్నానా అని అడగకు
అంటే బాగోలేనని కాదు
పెళ్ళయ్యాక అమ్మాయి జీవితం చాలా మందితో ముడిపడుతుంది
మాటల్ని చేతల్ని ఎవరో గుచ్చి గుచ్చి
గమనిస్తున్నట్లు ఉంటుంది
ఎందుకో
నీతో మాట్లాడాలనిపించింది
అప్పుడప్పుడు
స్లాం బుక్స్ చదువుతుంటే
మన ఆటపాటలన్నీ గుర్తుకు వచ్చాయి
పెళ్ళయ్యాక అమ్మాయిలకి
స్నేహితులు ఎందుకు దూరమవుతారో అర్థమయింది
అందుకే నీకు లేఖ వ్రాయట్లేదు
వ్రాయని స్నేహితురాలి లేఖ
వ్రాసిన స్నేహితురాలి లేఖ కంటే ఎక్కువ కదూ!