రైతే రాజు
రైతే రాజు


ప్రకృతేమో రైతన్నకు తోడులేని సమయంలో
ప్రభుత్వాలు ముందుకొచ్చి చేయూత లందించు..
రైతే రాజని నోరారా పిలిచేరు
రాజుకెందుకు సాయం అని ఆపకురు..
బడుగు జీవి బతుకులోన కష్టాలెన్నో ఉన్నా
భయపడక ఎదురొడ్డి నిలిచేను రైతన్న
ఆకలి బాధలెరిగి అందరికీ మంచి కోరి
భానుడి రాక ముందే నాగలిని చేత బట్టే
రైతన్నకు మనమందరం అండగా నిలుద్దాం..
దళారీల వ్యవస్థలో దయనీయ స్థితిలో
బతుకు వెళ్ళ దీస్తున్న రైతన్నకు సాయం చెయ్
పాడిపంట భూములన్నీ జన నివాసాలైతే
ధనిక పేద తేడా లేక
ఆకలిబాధ లన్నీ అందరికీ ఒక్కటే...