పెద్దయ్యాక ఏమవుతావ్
పెద్దయ్యాక ఏమవుతావ్


బంధువులంతా వచ్చారు మన బుజ్జిగాడింటికి
పట్టుమని పదేళ్లుంటాయేమో
బుజ్జిగాడు భలే మాట్లాడుతాడు
పెద్దయ్యాక ఏమవుతావ్
అని అడిగారు ఆ పిల్లాణ్ణి
సుందర్ లాల్ బహుగుణ అన్నాడు
అదేంట్రా
అందరూ డాక్టర్ ఇంజినీర్ అంటే
నువ్వేదో పేరు చెబుతున్నావ్
మీ టీచర్ సరిగ్గా పాఠాలు చెప్పట్లేదా
అని అడిగారు
సుందర్ లాల్ బహుగుణ
అంటే నాకు ఇష్టం
చెట్లు కొట్టకుండా చిప్కో ఉద్యమం చేశారు కదా
మాకు పుస్తకాల్లో కూడా వచ్చింది
అని గొప్పగా చెప్పాడు ఆ పిల్లాడు
పర్యావరణ పరిరక్షణ లేకుంటే
ఈ భూమి మనుగడ ప్రశ్నార్థాకమైతే
ఏం జరుగుతుందో అన్న విషయాలు పట్టని వాళ్ళు
పాపం ఈ పిల్లాడు సరిగ్గా ప్రపంచాన్ని అర్థం చేసుకోవట్లేదు అని నిట్టూర్చారు