STORYMIRROR

Sowmya Kankipati

Romance Tragedy Inspirational

4  

Sowmya Kankipati

Romance Tragedy Inspirational

మౌనం

మౌనం

2 mins
388

మౌనం..


మొదటిసారి నిన్ను చూడగానే ఎందుకో తెలియని మౌనం

తర్వాత మన పరిచయం మన స్నేహానికి పునాది అయింది

మాట మాట కలిసింది

ఆ మాటల ప్రవాహం

నిమిషాల నుండి గంటలు

గంటలనుండి రోజులు

రోజులనుండి వారాలు

వారాలునుండి నెలలు

ఆపై నెలలనుండి సంవత్సరాలు..


ఎంతలా అంటే ఎంత మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపించేంతగా..

చివరకి మౌనానికి చోటు లేకుండా పోయింది..


మరోసారి నీతో ప్రేమలో ఉన్నాక మళ్ళీ మొదలైన మౌనం

ఈ మౌనానికి అర్దం ప్రేమలో ఉండే ప్రతి ఒక్కరికీ తెలిసినదే

సిగ్గు, బిడియం,ప్రేమ అన్నీ కలిసిన మౌనం

అది కూడా నువ్వు నా ఎదురుగా ఉన్నప్పుడే మొదలయ్యే మౌనం

గలగలమని పలికే నా నోటి మాటలు

మొహమాటం లేని నా పలుకులకు అడ్డుకట్టుగా కొత్తగా చేరిన మౌనం


కానీ,

మాటలు కరువైనా 

మౌనం ముందున్నా 

మనసునిండా అందమైన ఊసులు ఆనందమైన భావాలు..


చివరికి ఆ మౌనం కూడా వీడిపోయింది

ఇద్దరి మధ్య మౌనం అనే అడ్డూ తొలగిపోయింది

ప్రేమలో ఇంత అందమైన అనుభూతి ఉంటుందా అనేలా గంటలు గడిచాయి

రోజులు గడిచాయి

వారాలు గడిచాయి

ఒక సంవత్సరం గడిచింది..


మళ్లీ మౌనం మొదలైంది

ఈ సారి ఉన్న మౌనం మొహమాటంతోనో, సిగ్గుతోనో కాదు

ఈ మౌనం హృదయానికి సంబంధించింది

మనసుని బంధించింది

నోరుని మూసేసింది

మాటకి, మనిషికి, మనసుకి ప్రేమకి హద్దు ఉంటుందని నేర్పింది

ఏదీ శాశ్వతం కాదని రుజువు చేసింది..


ఒకరిపై ఒకరికి కలహం లేదు

ఒకరిపై ఒకరికి కోపమూ లేదు

ఒకరిపై ఒకరికి అయిష్టం లేదు

ఒకరిపై ఒకరికి ద్వేషమూ లేదు

మరి ఎందుకు ఈ మౌనం

ఎందుకు ఈ మనోదూరం


ఎవరు ఇవ్వగలరు సమాధానం

ఎవరు తీర్చగలరు నా భారం

నా మౌనానికి కారణం ఎవరు

నా వేదనకు మందు ఎవరు


ఎందుకో తెలియదు

ఏమిటో అర్ధం కాదు 

ప్రేమలో మొదట్లో ఉన్నంత ఆనందం

చివరి వరకు ఎందుకు ఉండదో

మొదట్లో ముచ్చట గొలిపేలా కనిపించే ప్రేమ చివరవరకు ఎందుకు సాగదో


ఏమిటో ఈ ప్రేమలు

ఏమీ అర్ధం కావు

తప్పు ఎవరిదో తెలియదు

తప్పులేకపాయినా మౌనం ఎందుకు ప్రత్యక్షమవుతుందో తెలియదు


కానీ, ఒక్కటి మాత్రం సత్యం..

మాటకి ఎంత గొప్ప శక్తి ఉందంటే ఆ మాటతో మనిషి తన శత్రువుని సైతం మిత్రుడిని చేసుకోవచ్చు

అంతటి శక్తి గల మాట చివరికి తన మిత్రుడిని కూడా శత్రువుని చేస్తుంది.


అటువంటి ఆ మాటకే అంత శక్తి ఉంటే మనిషిని మనసుని సైతం దూరం చేసి దుఃఖంలో పడేస్తుంది మౌనం అనే మరో ఆయుధం


ఒక మనిషిని ఒక మాట ఎంత ప్రభావితం చేస్తుందో

ఒకరి మౌనం కూడా ఆ మనిషిని అంతకంటే ఎక్కువ ప్రభావితం చేస్తుంది


ఎందుకంటే

మనం ప్రేమించిన వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉంటే మనకి సమయమే తెలియదు 

అలాగే వారి మాటల్లో పడి ప్రపంచాన్నే మర్చిపోతాము


అదే మనిషి అంతటి స్వేచ్ఛ ఉన్న మనిషి మన మనసుకు దూరమైతే మనల్ని మనమే మర్చిపోతాము

చివరికి మౌనమే మన తోడుగా మిగుల్తుంది


Rate this content
Log in

Similar telugu poem from Romance