STORYMIRROR

Sowmya Kankipati

Inspirational

4  

Sowmya Kankipati

Inspirational

చిరునామా

చిరునామా

1 min
335

కాలంతో వచ్చీ పోయే వర్షం కాదు ప్రేమా 

కడవరకు నిలిచిపోయే వరం సుమా 

 కంటికి కనిపించని అనుభూతి ప్రేమా  

 వర్ణించలేని అందమైన మధురిమా 

ఊహల్లో విహరిస్తున్న హృదయమా 

హద్దు దాటొద్దంటున్న ప్రణయమా 

 ఆశగా ఆరాటపడుతున్న ప్రాణమా

 తలపులతో గతించిపోతున్న కాలమా 

మధుర స్వప్నాలు కంటున్న నయనమా 

మిగిలిపోయే తియ్యటి కల కాకుమా 

 అనుక్షణం తారసపడుతున్న ప్రియతమా !

 ఇప్పటికైనా తెలుపు నీ చిరునామా !!



Rate this content
Log in

Similar telugu poem from Inspirational