STORYMIRROR

Sowmya Kankipati

Inspirational

4  

Sowmya Kankipati

Inspirational

దేశమే ఓ సందేశమే..

దేశమే ఓ సందేశమే..

1 min
347

దేశమే ఓ సందేశమే..


మారాలి మన ఉద్దేశమే..

చూపాలి నిర్దేశమే..


ఓ మానవ మేలుకో

ఆలోచనలే మార్చుకో

నీ మంచితనం తెలుసుకో

సద్బుద్ధితో మసలుకో


ఉన్నతమైనవైతే నీ ఊహలు

పవిత్రమైతే నీ చూపులు

ప్రేరణ అయితే నీ చేతలు

సంకెళ్లో ఎందుకు నీ చేతులు


కనుక

మారాలి మన ఉద్దేశమే..

చూపాలి నిర్దేశమే..


ఓ మగువ మేలుకో

నీ విలువ తెలుసుకో

భవిష్యత్తుని మలుచుకో

బాధ్యతగా సాగిపో


మార్చుకుంటే నీ వస్త్రధారణ

మనసుకి ఎందుకు వేషధారణ

కలగదా స్వేచ్ఛ ఏ దారిన

ఉండదా అందరి ఆదరణ


కనుక

మారాలి మన ఉద్దేశమే..

చూపాలి నిర్దేశమే..


కావాలి మార్పు

తేవాలి మార్పు

రావాలి మార్పు మనలో..


చూపాలి మార్పు

చూడాలి మార్పు

చెయ్యాలి మార్పు మనమే..


జ్ఞానం సంపాదించు

అజ్ఞానం విసర్జించు

విజ్ఞానం పెంపొందించు

పరిజ్ఞానం ప్రదర్శించు


కానీ

సంస్కృతి సంప్రదాయాన్ని మరువద్దు

సంకల్పాన్ని విడువద్దు

సమాజాన్ని అణచొద్దు

స్వతంత్రాన్ని కోల్పోవద్దు


ఎందుకంటే

దేశమే ఓ సందేశమే..


మారాలి మన ఉద్దేశమే..

చూపాలి నిర్దేశమే..


Rate this content
Log in

Similar telugu poem from Inspirational