నాయకుడు
నాయకుడు

1 min

34.5K
మస్తిష్కమే నీ విల్లైతే!
గుండె బలమే నీ శరమైతే!
వెన్నంట సఖులు నీ దళమైతే!
విజయం నీ వశమవుతుంది!!
స్వరాజ్యమే నీ కాంక్షైతే!
విచక్షణే నీ వెలుగైతే!
భుజబలమే నీ సమిధలైతే!
స్వేచ్ఛే నీ శ్వాసవుతుంది!!
ప్రేరణే నీ ధ్యేయమైతే!
మార్పే నీ ఊపిరైతే!
వాక్కే నీ సత్తువైతే!
జగత్తే నీ సేనవుతుంది!!
జడుపే నీ శత్రువైతే!
నిబ్బరమే నీ బలమైతే!
ప్రభాసమే నీ వేగమైతే!
ప్రతిభ నీ తోడవుతుంది!!
***