చెలి చూపులు
చెలి చూపులు


చెలి వలపు ప్రేమ చూపులే,
నా యద తలపున ప్రేమ లేఖలు..!!
చెలి చెంత చిక్కిన ప్రేమ చూపులే,
నా స్వప్న చింత తీర్చే సిరిసంపదలు..!!
చెలి మోముపై చిగురించిన ప్రేమ చూపులే,
నా హరివిల్లులాంటి జీవితానికి వడి వడి అడుగులు..!!
చెలి కన్నులో వికసించిన ప్రేమచూపులే,
నా సుదూర మజిలికి అవధులు..!!