మనసుల బంధం
మనసుల బంధం


ఏడడగుల కలయిక అర్థం కాదు జీవితపు తొలిపయనం,
మనను మనసు తెలుసుకుని మెలిగిననాడు,
కుటుంబ భారాన్ని బాధ్యతతో కలసి మోసిననాడు,
కలత చెందని కలహాల నడుమ నలిగిననాడు,
భవిష్యత్ తరాల అల్లరి చేష్టలతో విసుగు చెందనినాడు,
వారసుల వృద్ధి చూసి కనులు తడిచినాడు,
ఆరుపదుల వయసులో అడుగడుగునా తోడు ఉన్ననాడు,
కదా జీవితపు తొలిపయనంకి అర్థం...!!