అదిగో స్వప్నం
అదిగో స్వప్నం
ప౹౹
అదిగో స్వప్నం అరుదెంచెనూ అడకగనే
మదిలో మారాం చేసె అర్ధం తెలుపకగనే ౹2౹
చ౹౹
పరికించగ మరి కలలోని సుందర పర్వం
పరిహసించి ప్రకటించూ తనలోని గర్వం ౹2౹
అది చాలునా అసూయను చూపించను
ఇది సందర్భమా విషయం నిరూపించను ౹ప౹
చ౹౹
అసూయన్నది నాకు ఆరోప్రాణం కాదుగ
ఆ కసాయి తనం నా మనుసుకు లేదుగ ౹2౹
ఆ అభిప్రాయం గోచరించే ఎపుడో కలలో
అనవసర అంశాలని ఎక్కించను తలలో ౹ప౹