వధ్య శిల
వధ్య శిల


జీవన క్రతువు పూర్తయ్యక ;
తీతువు ఋతువు మొదల య్యాక
అనుభూతుల రెక్కలు తెగి పడి
వార్ధక్యం జీవన వధ్య శిల పై
ఒరిగాక మదిలో వినిపిస్తుంది
మరణ మృదంగ ధ్వని !
మమతలు ఇంకిన ఎ డారి లో
ప్రేమ ఒయాసిస్సు కోసం
ముసురు ప ట్టిన ఆకాశం లో
వెలిగే ఇంద్ర ధనస్సు ల కోసం
ఎదురు చూపులు ఎండ మావులే
చెదలు తిన్న పుస్తకాలు ;
వెలిసిన వర్ణ చిత్రాలు
క ల్లోల కడలి కెర టా లు
పాత మంచం మీద
మినుక్కు మినుక్కు మంటున్న
ఒంటరి వ్రుద్ద నక్షత్రం !
లౌక్యం లేక
సౌఖ్యా ల కూ దూరమై
దయా బిక్ష ల బ్రాంతి కలిగించే
దయ మరణ స్మరణ వాళ్ళు
చేస్తుంటే
జీ వితానికి
మరణానికి
మధ్య ప్రాణం
సందిగ్ద దగ్ద గీతమై
అనివా ర్య మైన ముదిమి
హింస ద్వనిని అదమ లేన ప్పుడు
ప్రతీ రాత్రీ ఒక దీర్ఘ కా ళ
రాత్రి గా
మారుతుంది !
ప్రతి శ్వాసా
మృత్యు ధ్యాస లో
ధ్యాన మవుతుంది !